Telangana: గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు?

  • సిట్ లెక్క తేల్చినట్లు ఓ ఛానెల్ కథనం
  • బినామీల పేరిట 1019 ఎకరాల వ్యవసాయ భూములు
  • 29 భవనాలు, 2 కిలోల బంగారం కూడా

గతంలో పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీం మొత్తం ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లుగా సిట్ లెక్క తేల్చినట్టు ఓ టీవీ ఛానెల్ పేర్కొంది. దాని ప్రకారం, నయీం బినామీల పేరిట 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారం, రూ.2 కోట్ల నగదు ఉంది. నయీం ఆస్తులను కోర్టు తమ అధీనంలోకి తీసుకుంది. మొత్తం నమోదైన 251 కేసుల్లో 190 కేసులకు సంబంధించిన దర్యాప్తు పూర్తయింది. ఇంకా 61 కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. నయీం కేసులను రెండు నెలల్లో క్లోజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద ఉన్న మిలీనియం టౌన్ షిప్ లో తలదాచుకున్న నయీంను ఎన్ కౌంటర్ చేశారు. 

Telangana
Gangster
nayeem
assests
SIT
  • Loading...

More Telugu News