Telangana: పోలీసులను ఇంట్లో బంధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. ఎస్ఐ కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు!

  • సందీప్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు
  • ఇంట్లో బంధించినట్లు గచ్చిబౌలి పోలీసులకు ఎస్ఐ ఫిర్యాదు
  • ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు  

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచరుడు సందీప్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన తమను కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో బంధించారని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎస్ఐ కృష్ణ ఫిర్యాదు మేరకు కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా ఆధారంగా సందీప్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తేలింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటీవల సందీప్ బెయిల్ పై విడుదల అయ్యారు. 

Telangana
Police
Congress
konda
visweswar reddy
case
  • Loading...

More Telugu News