samudrakhani: 50 రోజుల్లో షూటింగు పూర్తిచేసిన రాజమౌళి తనయుడు

  • నిర్మాతగా రాజమౌళి తనయుడు
  • దర్శకుడిగా అశ్విన్ గంగరాజు 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి తనయుడు

కొత్తదనంతో కూడిన కాన్సెప్టులతో యువ దర్శక నిర్మాతలు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా .. అశ్విన్ గంగరాజు దర్శకుడిగా 'ఆకాశవాణి' సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేసుకున్నారు.

ఒక కీలకమైన పాత్ర కోసం తమిళ దర్శక నటుడు సముద్రఖనిని తీసుకున్నారు. ఆయా లొకేషన్స్ లో షూటింగును పక్కాగా ప్లాన్ చేసుకుని, 50 రోజుల్లో అంటే సింగిల్ షెడ్యూల్లో షూటింగును ముగించారు. నిన్నటితో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. కీరవాణి తనయుడు కాలభైరవ .. ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.  

  • Loading...

More Telugu News