paruchuri bhaskar rao: ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువ.. గెలుపు నాదే: అనకాపల్లి జనసేన అభ్యర్థి భాస్కరరావు

  • రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంతో అనుబంధం ఉంది
  • ఎంతో మందికి ఉపాధి కల్పించా
  • కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుస్తా

ఏపీ ఓటరు నాడి ఎవరికీ అర్థం కాని రీతిలో ఉంది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో... ప్రధాన పార్టీలు మెజారిటీ ఓట్లు తమకే పడ్డాయని ప్రకటించుకుంటున్నాయి. పలువురు నేతలు కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అనకాపల్లి జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కరరావు కూడా తాను విజయం సాధించబోతున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. శారదానగర్ కంపోస్టు యార్డ్, రామాపురం శ్మశానవాటిక సమస్యలను పరిష్కరించానని చెప్పారు. ఎంతో మందికి ఉపాధి కల్పించానని అన్నారు. నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని... కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతో తన గెలుపు ఖాయమని చెప్పారు.

paruchuri bhaskar rao
anakapalli
janasena
pawan kalyan
  • Loading...

More Telugu News