sexual: లైంగికంగా వేధిస్తున్నాడు: హెడ్మాస్టర్ పై విద్యార్థినుల ఫిర్యాదు

  • మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో ఘటన
  • బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విద్యార్థినులు
  • షీటీమ్ కు ఫిర్యాదు చేసిన సంఘం నేతలు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు కామంతో కళ్లుమూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానోపాధ్యాయుడు వెంకటరాంరెడ్డి తమపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. లిఖిత పూర్వకంగా ఆయనపై ఫిర్యాదు చేశారు. చదువు పేరుతో తిట్టడం, కొట్టడంతో పాటు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఐదుగురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో, బాలల హక్కుల సంఘం నేతలు షీటీమ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ, కొంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు తనపై కక్షకట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

sexual
harrassment
boduppal
high school
  • Loading...

More Telugu News