Yogi Adityanath: హనుమంతుడి గుడిలో కళ్లు మూసుకుని మౌనంగా కూర్చుండిపోయిన యోగి ఆదిత్యనాథ్!

  • 72 గంటల పాటు ప్రసంగాలపై నిషేధం
  • మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని తేల్చిన ఈసీ
  • ఆంజనేయునికి మౌన పూజలు చేసిన యూపీ సీఎం

మంగళవారం ఉదయం నుంచి 72 గంటల పాటు ఎటువంటి ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో మాట్లాడవద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఈ ఉదయం ఆయన హనుమంతుని ఆలయాన్ని సందర్శించారు.

దేవాలయానికి వచ్చిన ఆయన, ఏమీ మాట్లాడకుండా, కళ్లు మూసుకుని మౌనంగా పూజలు చేశారు. ఇటీవల ఆయన ముస్లింలకు అలీ ఉంటే, హిందువులకు బజరంగ్ బలి ఉన్నాడని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఇవి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారంపై మూడు రోజుల నిషేధాన్ని విధించింది. మాయావతి తదితరులపైనా ఇదే తరహా నిషేధాన్ని ఈసీ విధించిన సంగతి తెలిసిందే.

Yogi Adityanath
Uttar Pradesh
Silence
EC
  • Loading...

More Telugu News