Jagan: ఈ ఉదయం 11 గంటలకు జగన్ కు నరసింహన్ అపాయింట్ మెంట్!

  • ఏపీలో శాంతిభద్రతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం
  • పార్టీ నేతలతో కలిసి వెళ్లనున్న జగన్
  • పాలన దిగజారిందని ఫిర్యాదు చేయనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ ఉదయం ఆయన నేతృత్వంలోని వైసీపీ బృందం నరసింహన్ ను కలవనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉన్న జగన్ కు ఉదయం 11 గంటలకు గవర్నర్ కార్యాలయం అపాయింట్ మెంట్ ఇచ్చింది. గత వారంలో పోలింగ్ ముగిసిన అనంతరం వైసీపీ నేతలపైనా, కార్యకర్తలపైనా, చివరకు సాధారణ ప్రజలపైనా తెలుగుదేశం పార్టీ దాడులకు దిగిందని గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేయనున్నారు. తెలుగుదేశం పరిపాలనా తీరునూ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

Jagan
ESL Narasimhan
Governer
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News