Narendra Modi: మోదీ చెప్పినట్టే ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది: కేఏ పాల్

  • సీఈసీని కలిసిన కేఏ పాల్
  • ఈవీఎంల గురించి అడిగితే సమాధానం లేదు
  • బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరగాలి

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంలు ఒకే సమయంలో పోలింగ్ రోజున ఎందుకు మొరాయించాయని అడిగితే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఇకపై పోలింగ్ జరగాలని, లేదంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Narendra Modi
KA Paul
CEC
Delhi
Ballot
Polling
  • Loading...

More Telugu News