Narendra Modi: మోదీ నామినేషన్ సెంటిమెంట్.. ఇప్పుడు కూడా ర్యాలీ సంప్రదాయాన్ని కొనసాగించనున్న మోదీ!

  • 26న నామినేషన్ దాఖలు
  • 25న వారణాసిలో భారీ ర్యాలీ
  • గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో అనుసరించిన ర్యాలీ సంప్రదాయాన్నే ఆయన కొనసాగించనున్నారు. అప్పట్లో మోదీ నామినేషన్ వేయడానికి ముందు, గెలిచిన తరువాత ఆ నియోజకవర్గంలో మోదీ ర్యాలీలు నిర్వహించారు.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా మోదీ అదే విధంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఏప్రిల్ 25నే వారణాసికి చేరుకుని, ఆ రోజున భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి దశశ్వమేథ్ ఘాట్ వరకూ ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుని, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. నామినేషన్ వేసే రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు సమాచారం.  

Narendra Modi
Nomination
Benarus Hindu University
Rally
Kasi Viswanath Temple
  • Loading...

More Telugu News