Babu Rajendraprasad: విజయసాయి ఫిర్యాదుతో అధికారులను బదిలీ చేయడం సిగ్గుచేటు: బాబు రాజేంద్రప్రసాద్

  • బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలి
  • గతంలో జీవీఎల్ పుస్తకాలు రాశారు
  • కావాలనే అధికారుల బదిలీ

సీఎస్ సుబ్రహ్మణ్యం వైసీపీ అధినేత జగన్ కేసుల్లో ఏ-11గా ఉన్నారని, అసలు విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో అధికారులను బదిలీలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్‌నే వాడుతున్నారని పేర్కొన్నారు. తిరిగి బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గతంలో బ్యాలెట్ విధానాన్ని సమర్థిస్తూ పుస్తకాలు కూడా రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విషయంలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారులను కావాలనే బదిలీ చేశారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. స్వతంత్రంగా పని చేయాల్సిన సీఈసీ ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేయడం దారుణమని విమర్శించారు.

Babu Rajendraprasad
Chandrababu
GVL Narasimha Rao
Narendra Modi
CEC
  • Loading...

More Telugu News