YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమార్తె ఇంట్లో చోరీ

  • ఇంటి వెనుకభాగం నుంచి ప్రవేశించిన దొంగలు
  • 12 సవర్ల బంగారం, 30 వేల నగదు చోరీ
  • రంగంలోకి దిగిన పోలీసులు

వైసీపీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ త్రివేణి నివాసంలో చోరీ జరిగింది. త్రివేణి గుంటూరు విద్యానగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమె అమరావతి రోడ్డులో ఉండే ఐడీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. త్రివేణి భర్త జనార్దనరెడ్డి ఎన్నికల సందర్భంగా గామాలపాడు వెళ్లగా, ఆమె బెంగళూరు వెళ్లారు. అయితే, తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి కిటికీలో చేయిపెట్టి గడియ తీసి లోపలికి చొరబడ్డారు.

బీరువాలోని 12 సవర్ల బంగారు నగలు, రూ.30 వేలు నగదు ఎత్తుకెళ్లారు. బెంగళూరు నుంచి ఆదివారం రాత్రి గుంటూరు వచ్చిన డాక్టర్ త్రివేణి ఇంటికి చేరుకుని లబోదిబోమన్నారు. చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News