India: మోదీ చోర్ అన్న రాహుల్ గాంధీ.. నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు!

  • మోదీ దొంగని సుప్రీంకోర్టు చెప్పిందన్న రాహుల్
  • కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ధిక్కార పిటిషన్
  • ఈ నెల 22లోపు స్పందించాలంటూ సుప్రీం నోటీసులు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాఫెల్ డీల్ అంశంలో మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని పేర్కొంది. బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

ఫ్రాన్స్ తో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది.

దీనిపై హర్షం వ్యక్తం చేసిన రాహుల్.. సుప్రీంకోర్టు నిర్ణయంతో నైతిక విజయాన్ని సాధించామని అన్నారు. చౌకీదార్ చోర్ (మోదీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో రాఫెల్ ఒప్పందంలో ఏదో తప్పు ఉందని తేటతెల్లమయిందన్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు ధిక్కారానికి రాహుల్ పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. 

India
Congress
BJP
Narendra Modi
Rahul Gandhi
chor
chowkidar
Supreme Court
notice
meenakshi lekhi
  • Loading...

More Telugu News