Andhra Pradesh: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు!: స్పీకర్ కోడెల శివప్రసాదరావు

  • ఏపీలో అర్ధరాత్రి 12 గంటలవరకూ పోలింగ్ జరిగింది
  • 40-50 శాతం ఈవీఎంలు మొరాయించాయి
  • గుంటూరు జిల్లాలో మీడియాతో టీడీపీ నేత

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో రాత్రి 12 గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పాడైతే రిపేరు చేయడంపై అధికారులకు కనీస అవగాహన కల్పించడంలో ఈసీ విఫలమయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సందర్భంగా 40-50 శాతం ఈవీఎంలు మొరాయించాయని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోడెల మాట్లాడారు.

తగినంత మంది పోలీస్ బలగాలను మోహరించకపోవడం వల్లే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లర్లు చెలరేగాయని కోడెల ఆరోపించారు. కుట్రలో భాగంగానే తక్కువ మంది పోలీసులను ఎన్నికల విధులకు పంపారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ 130 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుందని కోడెల జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News