YSRCP: గుంటూరు జిల్లా ఘటనలపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ

  • మర్రి రాజశేఖర్ నేతృత్వంలో 9 మందితో కమిటీ ఏర్పాటు
  • పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు
  • కార్యకర్తలపై నమోదైన కేసుల పరిశీలన

పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మర్రి రాజశేఖర్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీ రూపొందించారు. పోలింగ్ నాడు అనేక ఘటనలకు వేదికగా నిల్చిన గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించనుంది. పోలింగ్ సందర్భంగానే కాకుండా ఆ తర్వాత రోజు చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపైనా మర్రి రాజశేఖర్ కమిటీ దృష్టి సారించనుంది.

ముఖ్యంగా, వైసీపీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. పోలింగ్ సందర్భంగా జరిగిన సంఘటనల్లో గాయపడిన తమ కార్యకర్తలకు కమిటీ నియామకం ద్వారా పార్టీ అండగా నిలుస్తుందని వైసీపీ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News