Prabhas: ఎప్పటి నుంచో ప్రభాస్‌ను అడుగుతున్నా.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ప్రభాస్
  • 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు
  • ప్రభాస్ అభిమానులు సంతోషించారన్న తమన్నా

ఇటీవల ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకైతే ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు కానీ, త్వరలో ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన ఖాతాలో కనీసం ఫోటో కానీ, ఎలాంటి పోస్ట్ కానీ పెట్టకముందే, ఆయన పేరును చూసి 7 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

అయితే ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై తాజాగా తమన్నా స్పందించింది. ప్రభాస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని తాను చాలా రోజులుగా అడుగుతున్నట్టు తెలిపింది. ఇప్పటికైనా వచ్చారని, తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ప్రత్యేకించి ప్రభాస్ అభిమానులు చాలా సంతోషించారని తమన్నా పేర్కొంది.

Prabhas
Tamannaah
Instagram
Post
Photo
Sahoo
  • Loading...

More Telugu News