Prabhas: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు ప్రభాస్ నుంచి మెచ్చుకోలు!

  • ఒరిజినల్ కంటే కబీర్ సింగ్ లుక్ బాగుంది!
  • సాహో షూటింగ్ లో టీజర్ చూసిన ప్రభాస్
  • ‌‍‍షాహిద్ కు ఫోన్ చేసి ప్రభాస్ తో మాట్లాడించిన స్టయిలిస్ట్

కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం పలు భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా, తెలుగు అగ్రహీరో ప్రభాస్ ను విపరీతంగా ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. సాహో చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రభాస్ సెట్స్ మీదే కబీర్ సింగ్ టీజర్ తిలకించి ఫోన్ లో షాహిద్ కపూర్ ను అభినందించినట్టు ప్రఖ్యాత హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ తెలియజేశారు.

"నేను సాహో షూటింగ్ కోసం ప్రభాస్ తో కలిసి హైదరాబాద్ లోనే ఉన్నాను. అప్పుడే ఆన్ లైన్ లో కబీర్ సింగ్ టీజర్ రిలీజైంది. ఆ టీజర్ ను చూసిన ప్రభాస్ ముగ్ధుడయ్యాడు. అతని టీమ్ మెంబర్స్ కూడా ఫిదా అయ్యారు. అప్పటికే వాళ్లందరూ అర్జున్ రెడ్డి చూసినవాళ్లే అయినా కబీర్ సింగ్ లో షాహిద్ పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రభాస్ స్పందన చూసిన వెంటనే షాహిద్ కు ఫోన్ చేసి ప్రభాస్ కు అందించాను. దాంతో వాళ్లిద్దరూ ఏడు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒరిజినల్ కంటే కబీర్ సింగ్ లుక్కే బాగుందని ప్రభాస్ ప్రశంసించారు" అని వివరించారు.

  • Loading...

More Telugu News