Nellore District: ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన!

  • వైసీపీ ఫ్లెక్సీలు చింపి వేసిన కార్యకర్తలు
  • కార్యాలయంలోకి వెళ్లేందుకు విఫలయత్నం
  • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు

నెల్లూరు జిల్లా తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఈ దాడిని నిరసిస్తూ కోటంరెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఫ్లెక్సీలు చింపి వేసిన కార్యకర్తలు, కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నట్టు సమాచారం. తిరుమలనాయుడిపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Nellore District
YSRCP
Telugudesam
tnsf
tirmuala naidu
  • Loading...

More Telugu News