Andhra Pradesh: ప్రజలను ఉత్సాహపరచడానికే హరీశ్ బావతో ఛాలెంజ్ చేశా!: టీఆర్ఎస్ నేత కేటీఆర్

  • మే 20లోపు స్థానిక ఎన్నికలను పూర్తిచేస్తాం
  • రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం భావిస్తున్నారు
  • టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుంది

తెలంగాణలో మే 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదంతో పాటు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు. అవినీతి నిర్మూలన లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై కేటీఆర్ ముచ్చటించారు.

ఈ సందర్భంగా బావ హరీశ్ రావుతో ఓట్ల మెజారిటీపై ఛాలెంజ్ చేసిన విషయమై స్పందించారు. ప్రజలను ఉత్సాహపరచడానికే అప్పుడు తాను హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని కేటీఆర్ తెలిపారు. మెదక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అనీ, అక్కడ టీఆర్ఎస్ కు కచ్చితంగా భారీ మెజారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మెజారిటీ విషయంలో మెదక్, వరంగల్, కరీంనగర్ అగ్రస్థానాల్లో నిలుస్తాయని అంచనా వేశారు.

Andhra Pradesh
Telangana
KTR
TRS
16 seats
  • Loading...

More Telugu News