News Delhi: దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • ఈవీఎంలు పనిచేయట్లేదని పార్టీలు చెబుతున్నాయి
  • ప్రజలు కూడా అదే చెబుతున్నారు
  • వీవీ ప్యాట్ లు లెక్కించాలి

దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు హాజరయ్యారు. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని అన్ని పార్టీలు చెబుతున్నాయని, అదేవిధంగా, ప్రజలు కూడా అంటున్నారని చెప్పారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించలేకపోతే, కనీసం వీవీ ప్యాట్ లు లెక్కించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

News Delhi
cm
Arvind Kejriwal
ECE
  • Loading...

More Telugu News