new delhai: యంత్రాలపై మాకు విశ్వాసం లేదు: కపిల్ సిబాల్

  • మాకు పేపర్ బ్యాలెట్ పైనే నమ్మకం ఉంది
  • లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియట్లేదు
  • ఢిల్లీలో మీడియా సమావేశంలో సిబాల్

తమకు పేపర్ బ్యాలెట్ పైనే నమ్మకం ఉందని, యంత్రాలపై విశ్వాసం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందనే ఆరోపణలపైన, వీవీ ప్యాట్స్ లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసే అంశంపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ఓటర్లకు తెలియట్లేదని అన్నారు. 50 శాతం వీవీ ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపును ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఈవీఎం యంత్రాలు ఎలా దుర్వినియోగం అవుతాయో తాము చూపిస్తామని అన్నారు. 

new delhai
constitutional club
cm
Chandrababu
  • Loading...

More Telugu News