east cost: తూర్పుతీరంలో చేపల వేటకు విరామం... నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి నిషేధం

  • జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ అనుమతి
  • ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్న 90 శాతం బోట్లు
  • మిగిలినవి సాయంత్రానికల్లా చేరుకుంటాయన్న అధికారులు

తూర్పుతీరంలో ఏటా అమలు చేసే వేట నిషేధం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. చేపల సంతానోత్పత్తి సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ఏటా 45 రోజుల పాటు మత్స్యశాఖ చేపల వేటపై నిషేధం విధిస్తుంది. దీన్ని ఈ ఏడాది రెండు నెలలకు పెంచింది. ఈ ఏడాది 61 రోజులపాటు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. సంతానోత్పత్తి కాలంలో వేట జరిగితే ఉత్పత్తి క్రమానికి ఆటంకం ఏర్పడుతుంది. మళ్లీ జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు అనుమతించనున్నారు. ఈ మేరకు ఏపీ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోనే 708 మెకనైజ్డ్‌ బోట్లు (మరపడవలు), దాదాపు 3,500 ఇంజిన్‌ బోట్లు, వెయ్యి వరకు తెప్పలు ఉన్నాయి. ఇవన్నీ రెండు నెలలపాటు తీరంలో కొలువుదీరనున్నాయి.

east cost
fishing ban
61 day from today
  • Loading...

More Telugu News