voting: ఏపీ ఓటింగ్‌లో మహిళలే టాప్‌.. పురుషుల కంటే 2 లక్షలు అధికం

  • పెరిగిన పోలింగ్‌కు ఇదే కారణం అంటున్న పరిశీలకులు
  • 2014లో 78.4 శాతం నమోదు
  • ఈ ఎన్నికల్లో 79.63 శాతం

ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. పురుషులను అధిగమించేశారు. ఈనెల 11వ తేదీన ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో మహిళలు భారీ సంఖ్యలో ఓటు వేశారని తేలింది. రాష్ట్రంలో మొత్తం 3,95,45,717 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,92,64,332 మందికాగా, మహిళలు 1,98,79,421 మంది.

ఈసారి ఎన్నికల్లో 79.63 శాతం మంది ఓటు వేశారు. అంటే 3,11,01,778 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో 78.4 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.  వీరిలో పురుష ఓటర్లు దాదాపు కోటి 55 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, మహిళలు కోటి 57 లక్షల మంది వినియోగించుకోవడం విశేషం. అంటే దాదాపు రెండు లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఈ అధిక ఓటు ఎవరికి పడితే వారిదే విజయం.

  • Loading...

More Telugu News