Keerthy Suresh: తను బాగుండదేమో... కీర్తి సురేశ్ కు షాకిచ్చిన రజనీకాంత్!

  • 'దర్బార్' హీరోయిన్ గా కీర్తి సురేశ్
  • జోడీ బాగుండదంటూ నయన్ ను తీసుకోవాలని రజనీ సిఫార్సు
  • సూపర్ చాన్స్ మిస్ చేసుకున్న కీర్తి!

తన పక్కన హీరోయిన్ గా యువనటి కీర్తి సురేశ్ బాగుండదని అభిప్రాయపడ్డ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ఆ స్థానంలో నయనతారను తీసుకోవాలని కోరడంతో దర్శకుడు మురుగదాస్ ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ, మురుగదాస్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దర్బార్' చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో మొదలైపోయింది.

 ఈ చిత్రంలో రజనీ సరసన కీర్తి సురేశ్ ను మురుగదాస్ ఎంపిక చేశారు. దీంతో ఆమెకు సూపర్ చాన్స్ వచ్చేసిందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక, తాజా పరిణామాలతో ఆమెకు చాన్స్ వచ్చినట్టే వచ్చి జారిపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రజనీకాంత్ తో రెండు సినిమాల్లో నటించిన నయనతార, ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంతో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. కోలీవుడ్ లో మంచి చాన్స్ కోల్పోయిన కీర్తి, టాలీవుడ్ లో మాత్రం మెగా అవకాశాన్ని కొట్టేసింది. కీర్తి, త్వరలో చిరంజీవికి జోడీగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు.

Keerthy Suresh
Rajanikant
Darbar
Murugadas
  • Loading...

More Telugu News