Chandrababu: కౌంటింగ్ తర్వాత పార్టీలు చేసుకునే అవకాశం ఉండదని.. వైసీపీ నేతలు ఇప్పుడే చేసుకుంటున్నారు: లంకా దినకర్ సెటైర్

  • జగన్ ముఖంలో సంతోషమే లేదు
  • దేశం మొత్తానికి తెలిపేందుకే ఢిల్లీ వెళ్లారు
  • ఓ వర్గం మీడియా దుష్ప్రచారం

ఎన్నికల కౌంటింగ్ తరువాత పార్టీలు చేసుకునే అవకాశం ఉండదని, ఇప్పుడే వైసీపీ నేతలు విందులు చేసుకుంటున్నారని టీడీపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జరిగిన దారుణాలను దేశం మొత్తం తెలియజేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలిపారు.

ఓ వర్గం మీడియా టీడీపీ ఓడిపోతుందని దుష్ప్రచారానికి పాల్పడుతోందంటూ లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ముఖంలో పోలింగ్ రోజున సంతోషమే లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబు పోరాడుతున్నారని తెలిపారు.

Chandrababu
Lanka Dinakar
Jagan
Delhi
YSRCP
  • Loading...

More Telugu News