Indu Sri: నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

  • ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇందుశ్రీ బాబాయి కూతురు
  • తండ్రి నిలదీయడంతో ఆత్మహత్య
  • ఆసుపత్రికి తరలించే లోపే మృతి

హైదరాబాద్‌ మణికొండలోని చిత్రపురి కాలనీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇందుశ్రీ అనే విద్యార్థిని నేటి ఉదయం ఎల్ఐజీ బ్లాక్-18లో నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

ఇందుశ్రీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల ఇందుశ్రీ బాబాయి కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ఇందూశ్రీకి తెలిసినప్పటికీ, తన తల్లిదండ్రులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ చెప్పలేదు. నేడు విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి ఆమెను ఇదే విషయమై నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Indu Sri
Inter
Suicide
Hyderabad
Manikonda
Police
  • Loading...

More Telugu News