Andhra Pradesh: కోడెలపై ఆ పనిని అసెంబ్లీలో ఎప్పుడో చేసి ఉండాల్సింది.. వ్యవస్థ బాగుపడేది!: వైసీపీ నేత బొత్స సెటైర్లు

  • అంబటి రాంబాబుపై కేసుపెట్టడం దారుణం
  • ఘటనాస్థలిలో లేని వ్యక్తిపై కేసులెలా పెడతారు?
  • కోడెల స్పీకర్ అని చెప్పడానికే సిగ్గుగా ఉంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటనలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణమని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల గ్రామంలో కోడెలపై దాడి జరిగినప్పుడు అంబటి రాంబాబు అక్కడ లేనేలేరని స్పష్టం చేశారు. ఘటనాస్థలిలో లేని వ్యక్తులపై అసలు ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఇంకా చంద్రబాబు చెప్పుచేతల్లో ఉందని చెప్పడానికి ఈ ఘటనే తాజా నిదర్శనమని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ఓ టీవీ ఛానల్ తో బొత్స మాట్లాడారు.

కోడెల ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారనీ, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని బొత్స  విమర్శించారు. అలాంటి వ్యక్తిని స్పీకర్ అని చెప్పడానికే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తిని తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని బొత్స దుయ్యబట్టారు. ‘ఇనిమెట్లలో ప్రజలు నిన్న చేసిన పనిని కోడెలకు అసెంబ్లీలో ఇప్పటికే చేసి ఉండాల్సింది. అప్పుడు వ్యవస్థ బాగుపడేది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News