Andhra Pradesh: విశాఖపట్నంలో దారుణం.. ఆడుకుంటూ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయి బాలుడు మృతి!

  • జిల్లాలోని పీతవానిపాలెంలో ఘటన
  • ఉదయాన్నే ఇంటిబయట ఆడుకుంటున్న కార్తీక్
  • సెప్టిక్ ట్యాంకులో మునిగిపోయి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి సెప్టిక్ ట్యాంకులో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని మద్దిలపాలెంలో ఉన్న పీతవానిపాలెంలో కార్తీక్(5) అనే బాలుడు, తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా, ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు సమీపంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు.

అయితే చిన్నారి కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. దీంతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడిన బాలుడు సెప్టిక్ ట్యాంకులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కొద్దిసేపటి అనంతరం బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో పిల్లాడిని సెప్టిక్ ట్యాంక్ లో విగతజీవిగా గుర్తించారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కార్తీక్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Visakhapatnam District
boy
dead
septic tank
Police
  • Loading...

More Telugu News