summer holidays: సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: తెలంగాణ విద్యాశాఖ హెచ్చరిక

  • ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ ఇది వర్తింపు
  • నేటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • జూన్‌ ఒకటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

వేసవి సెలవుల్లో పాఠశాలలు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు తప్పక పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపింది. రాష్ట్రంలో శనివారం నుంచి వేసవి సెలవులు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మే 31 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 1న తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఏ రూపంలోనూ క్లాసులు నిర్వహించరాదని సూచించింది.

  • Loading...

More Telugu News