Andhra Pradesh: చంద్రబాబు బ్రాహ్మణులపై కక్ష కట్టారు.. ఎల్వీ సుబ్రహ్మణ్యంను అవమానించేలా మాట్లాడారు!: అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్

  • సీఎస్ పునేఠాపై ఒత్తిడి చేసి బలిపశువును చేశారు
  • ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్దోషి అని హైకోర్టు చెప్పింది
  • అమరావతిలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బ్రాహ్మణులపై కక్ష కట్టారని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ ఆరోపించారు. తాను చెప్పినట్లే వినాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను చంద్రబాబు బలిపశువును చేశారని విమర్శించారు. అలాగే కొత్త సీఎస్ గా మరో బ్రాహ్మణ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరిస్తే, ఆయన్ను కూడా అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి ద్రోణంరాజు మీడియాతో మాట్లాడారు.

జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్దోషి అని 2018, జనవరిలోనే ఉమ్మడి హైకోర్టు ప్రకటించిందని గుర్తుచేశారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయానికి  సీఎస్ వెళ్లడం ఎన్నికల ప్రక్రియలోనే భాగమని స్పష్టం చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారులతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు స్పందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గతంలో అడ్వొకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును బ్రాహ్మణులు ఇంకా మరిచిపోలేదన్నారు.

  • Loading...

More Telugu News