Bihar: అతడు చూస్తే పక్కా కూలీ, కానీ అతడి ఇంగ్లీష్ చూసి రిపోర్టర్ మతిపోయింది!

  • బీహార్ లో ఘటన
  • ఎంతో వేగంగా మాట్లాడిన వైనం
  • నోరెళ్లబెట్టిన రిపోర్టర్

కూలీ పనిచేసుకోవడం అంటే చదువుసంధ్య లేనివాళ్లు బతకడానికి ఎంచుకున్న మార్గంగా అందరూ భావిస్తారు. వాళ్లకు పెద్దగా జ్ఞానం ఉండదని, అందుకే కాయకష్టాన్ని నమ్ముకుంటారని తక్కిన సమాజంలో ఓ నమ్మకం ఉంది. కానీ బీహార్ లో ఓ కూలీని చూస్తే ఆ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారు. అతడు ఆంగ్లంలో మాట్లాడుతూ మీడియా ప్రతినిధులను సైతం విస్మయానికి గురిచేశాడు. ఉత్తరాదిలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓ హిందీ న్యూస్ చానల్ రిపోర్టర్ సామాన్యుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఐ వాంట్ టు వర్క్" అంటూ మొదలు పెట్టిన ఆ కూలీ ఎక్కడా తడుముకోకుండా ఇంగ్లీష్ మాట్లాడడం సదరు రిపోర్టర్ కు మతిపోయేలా చేసింది. "ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావా?" అంటూ రిపోర్టర్ విస్మయం వ్యక్తం చేసేలోపే "యస్, వై నాట్" అంటూ దిమ్మదిరిగిపోయే రిప్లయ్ ఇచ్చాడా కూలీ. ఇంతకీ ఆ కూలీ ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? ప్రముఖ విద్యాకేంద్రంగా పేరుగాంచిన భాగల్ పూర్ యూనివర్శిటీలోనట!

  • Loading...

More Telugu News