Jagan: పలు అంశాలపై చర్చించేందుకు పీకేతో భేటీ అవుతున్న జగన్!

  • పోలింగ్ సరళిపై చర్చ
  • వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేసిన పీకే టీం
  • పీకే సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక

వైసీపీ అధినేత జగన్, తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో సర్వేలకు సంబంధించిన లెక్కలు, పోలింగ్ సరళి తదితర అంశాలపై జగన్, పీకేతో చర్చించనున్నారు. ఎన్నికలకు ముందు పీకే టీం నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాన్ని ఇచ్చింది. వైసీపీ  గెలుపే లక్ష్యంగా పని చేసింది. దీనికిగాను ఆయనకు జగన్ అభినందనలు తెలియజేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జగన్, పీకే సూచనల మేరకే నడుచుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Jagan
Prashanth Kishore
Polling
YSRCP
  • Loading...

More Telugu News