Khammam District: నేనెప్పుడూ ఖమ్మం జిల్లా ఆడబిడ్డనే: రేణుకా చౌదరి

  • నైతిక బాధ్యతతో వ్యవహరించాం
  • ఏ ఒక్కరికీ డబ్బులు పంపిణీ చేయలేదు
  • ధన రాజకీయం కన్నా, ప్రజా రాజకీయం వైపే ప్రజలు మొగ్గు చూపారు

ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఈ ఎన్నికల్లో నైతిక బాధ్యతతో తాము వ్యవహరించామని, ఏ ఒక్కరికీ డబ్బులు పంపిణీ చేయలేదని అన్నారు. తమ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలకు తన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ధన రాజకీయం కంటే, ప్రజా రాజకీయం వైపే ప్రజలు మొగ్గు చూపారని చెప్పిన రేణుకా చౌదరి, తాను ఎప్పుడూ ఖమ్మం జిల్లా ఆడబిడ్డనేనని అన్నారు.

Khammam District
congress
mp
Renuka chowdary
  • Loading...

More Telugu News