Andhra Pradesh: ఎన్నికల నిర్వహణలో ఈసీ, పోలీసులు విఫలమయ్యారు: భూమా అఖిలప్రియ

  • కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది
  • వైసీపీకి అనుకూలంగా పని చేస్తోంది
  • ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ, పోలీసులు విఫలమయ్యారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇక్కడ పని చేసిన పోలీస్ సిబ్బందినే నియమించడం వల్ల గొడవలకు దారితీసిందని, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా పని చేస్తోందని, ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆళ్లగడ్డలో నిన్న పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Elections
Allagadda
akhila priya
  • Loading...

More Telugu News