Chandrababu: అధికారం ఉంది కదా అని ఎన్నికల అధికారులను బెదిరిస్తారా?: చంద్రబాబుపై దాడి వీరభద్రరావు మండిపాటు

  • 50 లక్షల ఓట్లు తొలగించారు
  • ఓట్లు కొనేందుకు డబ్బు వెదజల్లారు
  • చంద్రబాబుది దుర్మార్గం

పోలింగ్ ముగిసిన తర్వాత కూడా టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా హింస చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనలపై ఇరుపార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సూటిగా ఎన్నికల సంఘానిదే ఈ వైఫల్యం అంటూ ఎత్తిచూపుతున్నారు. మరోవైపు వైసీపీ నేత దాడి వీరభద్రరావు ట్విట్టర్ లో స్పందించారు. ఓట్లు కొనేందుకు చంద్రబాబు డబ్బును ఇష్టంవచ్చినట్టు వెదజల్లారని ఆరోపించారు.

అధికారం ఉంది కదా అని ఈసీ అధికారులను బెదిరించడం ద్వారా చంద్రబాబు వీధిరౌడీలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ముందు 50 లక్షల ఓట్లను కావాలనే తొలగించారని దాడి ఆరోపించారు. అంతేకాకుండా, ఎన్నికల్లో తనకు మంచి పేరు వచ్చేలా రెండు సినిమాలు తీయించుకున్నారని, వాటిలో ఎక్కడా తన వెన్నుపోటు చరిత్ర కనపడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు వాటిని ఆదరించలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News