Allagadda: ఆళ్లగడ్డలో ఇంకా చల్లారని ఉద్రిక్తత... 15 ఏళ్ల నాటి పరిస్థితంటున్న ప్రజలు!

  • ఎన్నికల సందర్భంగా గొడవలు
  • 9 మందికి తీవ్రగాయాలు
  • అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కేసు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 15 సంవత్సరాల క్రితం ఉన్న ఫ్యాక్షన్ వాతావరణం తిరిగి కనిపిస్తోందని, నిన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైన గొడవలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ బూత్ ల వద్ద టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గొడవలకు దిగి, రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే.

ఆపై ఈ ఉదయం కూడా కొన్ని చోట్ల గొడవలు జరగడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అయినా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పోలీసులు అంటున్నారు. మరోవైపు పోలింగ్ బూత్ లోకి అక్రమంగా ప్రవేశించిన నేరానికి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్నటి గొడవల్లో దాదాపు 9 మందికి తీవ్రగాయాలు కాగా, అందులో ఇరు పార్టీల కార్యకర్తలూ ఉన్నారు.

Allagadda
Akhilapriya
Bhargava Ram
Police
  • Loading...

More Telugu News