Kurnool District: నిలకడగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం

  • ఈ ఎన్నికల్లో జనసేన తరపున బరిలో నిలిచిన రెడ్డి
  • ప్రచార సమయంలో తీవ్ర అస్వస్థత
  • ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం

నంద్యాల సిట్టింగ్‌ ఎంపీ, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎస్‌.పి.వై.రెడ్డి ఆరోగ్యం కుదుట పడుతోందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని కేర్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయనకు టీడీపీ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో మొండి చెయ్యిచూపింది. దీంతో జనసేనలోకి ఫిరాయించిన ఆయన ఆ పార్టీ టికెట్టుపై మళ్లీ బరిలో నిలిచారు. తీవ్ర అనారోగ్యం కారణంగా వీల్‌ చైర్‌పైనే ప్రచారం చేస్తూ వచ్చిన ఆయన కొద్దిరోజుల క్రితం ఎండదెబ్బకు అస్వస్థులయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడితే వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

Kurnool District
nadyala
spy reddy
health recovered
  • Loading...

More Telugu News