intermediate results: కాసేపట్లో విడుదల కానున్న ఏపీ ఇంటర్‌ ఫలితాలు

  • విడుదల చేయనున్న ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి
  • మొదటి, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్‌ ఒకేసారి
  • విద్యార్థులకు గ్రేడ్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియేట్‌ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు సంవత్సరాల ఫలితాలను ఈరోజు 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి అమరావతిలోని ఏపీ సచివాలయం సమావేశ మందిరంలో విడుదల చేస్తారు. గత ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అంటే ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు తొలిసారి గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. రెండేళ్ల విద్యార్థులు మొత్తం 10,17,600 మంది పరీక్ష రాశారు.

intermediate results
amaravathi
inter board
  • Loading...

More Telugu News