BJP MLA: పొలింగ్ బూత్‌లో ఫొటో తీసుకున్న ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే

  • తొలి విడతలోనే ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు పూర్తి
  • ఓటు వేసి ఫొటో తీసుకున్న బద్రీనాథ్ ఎమ్మెల్యే
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘన

ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. బద్రీనాథ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ బూత్‌లో ఫొటో తీసుకున్నారు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ప్రకారం పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, ఫొటోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ దానిని ఉల్లంఘించి దర్జాగా ఫొటో తీసుకున్నారు.

తొలి విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఐదు స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా బద్రీనాథ్‌లో ఓటు వేసిన ఆయన ఫొటో తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం సత్వరమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

BJP MLA
photo
polling booth
Mahendra Bhatt
Badrinath
Uttarakhand
  • Loading...

More Telugu News