Gopal Shetty: అందంగా ఉంటుందనే ఊర్మిళకు టికెట్ ఇచ్చారు: బీజేపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఆమెకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది
  • ఆమె ముఖం చూసి ఓట్లు పడతాయని భావిస్తోంది
  • బీజేపీ నేత గోపాల్ శెట్టికి వివాదాలు కొత్త కాదు

బాలీవుడ్ ప్రముఖ నటి, కాంగ్రెస్ ముంబై నార్త్ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్‌పై ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత గోపాల్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఊర్మిళ ముఖం చూసే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, ఆమె సెలబ్రిటీ కాబట్టి ఓట్లు పడతాయని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఊర్మిళకు రాజకీయాలపై కనీస అవగాహన ఉంటే ఉండొచ్చు కానీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పుచేసిందని వ్యాఖ్యానించారు.

 65 ఏళ్ల గోపాల్‌కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల ఊర్మిళను ఉద్దేశించి ఆమెకు ఆడంబరం ఎక్కువని, రాజకీయాల్లో ఆమె జీరో అని వ్యాఖ్యానించారు. గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో క్రిస్టియన్లు పాల్గొనలేదంటూ మాట్లాడి ఆయన వివాదం రేపారు.

Gopal Shetty
Mumbai
Congress
BJP
Urmila Matondkar
  • Loading...

More Telugu News