Andhra Pradesh: విజయనగరం జిల్లాలో అత్యధికంగా 74 శాతం ఓటింగ్

  • అత్యల్పంగా విశాఖ జిల్లాలో 55 శాతం ఓటింగ్
  • ముగిసిన పోలింగ్
  • క్యూలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్న అధికారులు

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ గడువు కాగా, ఆ సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక, సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన ఓటింగ్ చూస్తే విజయనగరం మొదటిస్థానంలో ఉంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 74.18 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 55.82 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

ఇతర జిల్లాల విషయానికొస్తే, ప్రకాశం జిల్లాలో 70.74 శాతం, చిత్తూరు జిల్లాలో 69.32 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 67.28 శాతం, అనంతపురం జిల్లాలో 67.08 శాతం, నెల్లూరు జిల్లాలో 66.90 శాతం, కృష్ణా జిల్లాలో 64.50 శాతం, కడప జిల్లాలో 63.90 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 63.77 శాతం, కర్నూలు జిల్లాలో 63 శాతం, గుంటూరు జిల్లాలో 61.12 శాతంగా నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా ఓటింగ్ శాతం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News