Guntur District: కాసు మహేశ్ రెడ్డి కారుపై రాళ్లు రువ్విన టీడీపీ కార్యకర్తలు!

  • గురజాల నియోజకవర్గంలో సంఘటన
  • ఓ పోలింగ్ బూత్ ను పరిశీలించిన కాసు
  • కాసుపై దాడిని నిరసించిన వైసీపీ కార్యకర్తలు

వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు వెళ్లిన కాసు మహేశ్ పై ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఈ దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన తమ నేతకు భద్రత కల్పించలేకపోయారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

Guntur District
Gurajala
Telugudesam
YSRCP
Kasu
  • Loading...

More Telugu News