gangula brijendra reddy: మేము ఎవరినీ కిడ్నాప్ చేయలేదు.. భూమా కుటుంబమే మాపై దాడి చేసింది: గంగుల

  • కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు
  • ఓటమి భయంతో భూమా కుటుంబం తప్పుడు ఆరోపణలు చేస్తోంది
  • ఆధారాలు ఉంటే చూపించాలి

కడప జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. తమ ప్రధాన అనుచరుడు రవిని వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి కిడ్నాప్ చేయించారంటూ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్, ఆమె సోదరి మౌనిక, సోదరుడు విఖ్యాత్ రెడ్డిలు ధర్నాకు దిగారు. రవిని వెంటనే అప్పగించాలని డిమాండ్  చేశారు.

ఈ అంశంపై గంగుల స్పందించారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, ఆ అవసరం కూడా తమకు లేదని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే భూమా కుటుంబం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తాము కిడ్నాప్ చేసినట్టు ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. వాళ్ల మనుషులు కిడ్నాప్ అయి ఉంటే ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అహోబిలంలో తమపై దాడి చేసింది భూమా అనుచరులేనని ఆరోపించారు.

gangula brijendra reddy
ysrcp
bhuma
akhilapriya
Telugudesam
allagadda
  • Loading...

More Telugu News