bhuma akhilapriaya: మా ప్రాణాలకే రక్షణ లేకపోతే... సామాన్యుల సంగతేమిటి?: భూమా మౌనిక

  • వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు
  • సీఐ కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
  • మా వాహనాలను ధ్వంసం చేశారు

వైసీపీ నేతల గూండాయిజం, రౌడీయిజాలకు అంతు లేకుండా పోతోందని మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక మండిపడ్డారు. తమకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు కూడా వైసీపీ నేతలకే వత్తాసు పలుకుతున్నారని... సీఐ కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇష్టానుసారం తిరుగుతున్నా, మనుషులను కొట్టినా పట్టించుకోవడం లేదని అన్నారు. తమ వాహనాలను ధ్వంసం చేశారని, వాహనాలలో కర్రలు పెట్టుకుని తిరుగుతున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ పనులు చేస్తున్నారని అన్నారు.

bhuma akhilapriaya
bhuma mounika
allagadda
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News