Jammu And Kashmir: ఈవీఎంలలో సమస్య.. పని చేయని కాంగ్రెస్ బటన్

  • పూంఛ్ జిల్లాలో మొరాయిస్తున్న ఈవీఎంలు
  • కాంగ్రెస్ బటన్ పని చేయడం లేదంటూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్
  • బీజేపీ బటన్ కూడా పని చేయలేదన్న జిల్లా కలెక్టర్

జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. కొన్నింటిలో కాంగ్రెస్ గుర్తుకు కేటాయించిన బటన్ పని చేయడం లేదు. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ బటన్లు పని చేయడం లేదంటూ ఓ వార్తా ఛానల్ ప్రసారం చేసిన వార్తను కూడా తన ట్వీట్ కు జతపరిచారు.

మరోవైపు పూంఛ్ జిల్లాలోనే కాకుండా, సురాన్ కోట్ జిల్లాలో కూడా కాంగ్రెస్ బటన్ పని చేయడం లేదని పలువురు స్థానికులు ఆరోపించారు. దీనిపై ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పందిస్తూ, ఈసీ కార్యాలయం నుంచి తెచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే పని చేశాయని చెప్పారు. పూంఛ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈవీఎంలో కాంగ్రెస్ బటన్ మాత్రమే కాకుండా... బీజేపీ బటన్ కూడా పని చేయలేదని తెలిపారు. జమ్ము లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి పూంఛ్ జిల్లా వస్తుంది.

Jammu And Kashmir
poonch
evm
congress
button
  • Loading...

More Telugu News