Andhra Pradesh: విశాఖపట్నంలో ఓటేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ప్రజలు భారీగా బారులు తీరడంపై సంతోషం!

  • విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్న జేడీ
  • నగరంలో విద్యావంతులు ఎక్కువని వ్యాఖ్య
  • ప్రజలు ప్రజాస్వామ్యంతో ఉన్నారన్న లక్ష్మీనారాయణ

జనసేన నేత, విశాఖపట్నం లోక్ సభ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖలోని 179 పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారని తెలిపారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న విశాఖలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు.

పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరామన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉన్నారని అర్థమని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

Andhra Pradesh
Visakhapatnam District
jd lakshmi narayana
Jana Sena
  • Error fetching data: Network response was not ok

More Telugu News