tammareddy bharadwaja: పవన్- అలీ మాటల యుద్ధం నాకు నచ్చలేదు: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

  • పవన్ .. అలీ ఇద్దరూ మంచివాళ్లు 
  • పవన్ అలా అనకుండా ఉండాల్సింది
  •  అలీ తొందరపడకుండా ఉండాల్సింది  

ఇటీవల పవన్ కల్యాణ్ రాజమండ్రి సభలో మాట్లాడుతూ అలీ వైసీపీలో చేరిన విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడటం .. అందుకు కౌంటర్ గా అలీ ఒక వీడియోను వదలడం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. "పవన్ కల్యాణ్ .. అలీ ఈ ఇద్దరూ నాకు తెలుసు. ఈ ఇద్దరి మధ్య ఎంతటి స్నేహబంధం ఉందనేది కూడా నాకు తెలుసు.

అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు స్పందించిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. అలీ హర్ట్ కావడంలో అర్థం వుంది .. వ్యక్తిగతంగా పవన్ విమర్శలు చేయకుండా ఉండాల్సింది. ఇక అలీ కూడా వీడియోను వదిలే విషయంలో తొదరపడకుండా ఉండాల్సింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోయేవి. విషయం ఇంతవరకూ వచ్చేది కాదు. పవన్ .. అలీ ఇద్దరూ కూడా చాలా మంచి వాళ్లు. త్వరలోనే మళ్లీ వాళ్లు కలుసుకుంటారని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

tammareddy bharadwaja
  • Loading...

More Telugu News