Andhra Pradesh: వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని ప్రశ్నించిన మీడియా.. వైఎస్ భారతి కీలక వ్యాఖ్యలు!

  • కడప జిల్లా పులివెందులలో ఓటేసిన భారతి
  • యువ నాయకత్వానికి ఓటేయాలని పిలుపు
  • జగన్ కు వచ్చే సీట్లపై కీలక వ్యాఖ్యలు

ధైర్యవంతుడైన యువ నాయకుడిని, విశ్వసనీయత ఉన్నవాడిని గెలిపించాలని యువ ఓటర్లను వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కోరారు. కడప జిల్లా పులివెందులలో ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మేడం.. ఈసారి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అని ప్రశ్నించారు.

దీంతో ‘అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు కూడా వస్తాయి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేసేవారికి ఓటేయాలని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను వైఎస్ భారతి మరోసారి కోరారు.

Andhra Pradesh
Kadapa District
YSRCP
bharati
Jagan
pulivendula
vote
175 seats]
  • Loading...

More Telugu News