Dwivedi: మొత్తం 372 ఈవీఎంలు పనిచేయడం లేదు... ఓటర్లు సహకరించాలన్న ద్వివేది!

  • సిబ్బంది అవగాహనా లోపంతోనే సమస్యలు
  • సక్రమంగా కనెక్షన్లు ఇవ్వలేకపోయారు
  • అదనపు ఈవీఎంలు తరలించామన్న ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈవీఎంలు పనిచేయని చోట్ల ఓటర్లు సహనంతో ఉండాలని ఎన్నికల సిబ్బందికి సహకరించాలని విన్నవించారు.

సిబ్బంది అవగాహనా లోపం కారణంగా సమస్యలు వచ్చాయని, ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ లను సక్రమంగా కనెక్షన్ ఇవ్వలేని చోట్ల మాత్రమే సమస్యలు వచ్చాయని, ప్రస్తుతం దాదాపు అన్ని చోట్లా సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కొన్ని ప్రాంతాలకు ఇంజినీర్లను, అదనపు ఈవీఎంలను తరలించామని చెప్పారు.

Dwivedi
EVMs
Voters
Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News