Andhra Pradesh: ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్.. ఈసీకి మద్దతుగా కీలక వ్యాఖ్యలు!

  • విజయవాడలో ఓటేసిన జనసేనాని
  • దాదాపు 200 చోట్ల ఈవీఎంలు పనిచేయట్లేదని వ్యాఖ్య
  • ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని ఆశాభావం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలో ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. గాజువాక, పాలకొల్లు సహా కొన్ని నియోజకవర్గాల్లో 200 ఈవీఎంల వరకూ పనిచేయడం లేదని తమ కార్యకర్తలు చెప్పారన్నారు. ఇది భారీ స్థాయి ఎన్నికలనీ, కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని చెప్పి, తటాలున ఓ విమర్శ చేసేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈసీకి ఈ విషయాలన్నీ తెలుసనీ, వాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
Pawan Kalyan
vote
  • Loading...

More Telugu News