Rajat Kumar: తెలంగాణలో ఎక్కడా సమస్య లేదు... అంతా సవ్యమే: సీఈఓ రజత్ కుమార్!

  • ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది
  • మాక్ పోలింగ్ విజయవంతం
  • ఫిర్యాదులు వస్తే పరిష్కరిస్తున్నామన్న రజత్ కుమార్

తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఎక్కడా ఏ విధమైన సమస్యలూ లేవని రాష్ట్ర ఎన్నిక సీఈఓ రజత్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలింగ్ సరళిపై మీడియాతో మాట్లాడిన ఆయన, మాక్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఆపై పోలింగ్ ప్రారంభంకాగా, ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు.

 నిజామాబాద్ లోక్‌ సభ కు కూడా మాక్ పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించామని, ఎక్కడా ఫిర్యాదులు రాలేదని అన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్యలు ఏర్పడినట్టు ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని రజత్ కుమార్ వ్యాఖ్యానించారు.

Rajat Kumar
Telangana
elections
  • Loading...

More Telugu News